Saturday, February 28, 2009

పూరీలు పొంగుతూ రావాలంటే....

గృహిణులకు చిట్కాలు~: పూరీలు పొంగుతూ రావాలంటే....


నోరూరించే పూరీలు మెత్తగా, హోటళ్ళలో లాగా పొంగుతూ తయారు చేయాలని అందరికీ ఉంటుంది..కానీ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు..దీనికి సులువైన "మన అమ్మ "చిట్కా. పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి.

చపాతీలు మెత్తగా రావాలంటే..

గృహిణులకు చిట్కాలు~: చపాతీలు మెత్తగా రావాలంటే..

చపాతీలు మెత్తగా రావాలంటే "మన అమ్మ" చిట్కా .. పిండి కలిపేటప్పుడు పావు స్పూను బేకింగ్ సోడా వేసి కలపండి.

మాతృదేవోభవ -పితృదేవోభవ (భాగం -2)

మాతృదేవోభవ -పితృదేవోభవ

లోపలికి వెళ్ళిన సుమతి భిక్ష తెచ్చేంతలో ఆమె భర్త రాగా అతనికి కాళ్ళు కడిగి భొజనం పెట్టి భర్త నిద్ర పోయేదాకా కాళ్ళు వత్తుతూ పతిసేవలో నిమగ్నమైంది.కౌశికుని కోపం అవధులు దాటి పోతున్నది.భర్త నిదురించగానే సుమతి ఒక పళ్ళెం నిండా భిక్ష తీసుకుని, కౌశికుని జోలెలో వేయటానికి రాగానే, కౌశికుడు నిప్పులు కురిసే కళ్ళతో ఆమెవంక చూసాడు. అతని చూపుకు సుమతి ఏమాత్రం భయపడ్డక, నేనేమీ చెట్టు మీద కాకిని కాదు. నీచూపుకు బూడిద కావటానికి అని పలికింది. కౌశికుడు ఆశ్చర్యంతో అడవిలో జరిగిన సంగతి ఈమెకెలా తెలిసిందా అనుకుని ఆమె పాదాలపైబడి తనకు ఙ్ఞానభిక్ష పెట్టమని అర్ధించాడు.తరువాత సుమతి ఏమని పలికిందో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

మాతృదేవోభవ - పితృదేవోభవ (భాగం -1)

ఇది ప్రసిద్ధమైన పురాణగాధలో ఉన్న దివ్య కథ.పూర్వం ఒక అరణ్యం లో కౌశికుడు అనే మహర్షి తపస్సు చేసి, కొంత తపః శక్తి గడించాడు.అతను ఒకసారి ధ్యాన దీక్షలో ఒక వృక్షం క్రింద కూర్చొని ఉండగా, ఒక కాకి రెట్ట వేయటంతో ధ్యానభంగం కలిగి, దాని వంక కోపంగా చూసాడు.అతని కోపాగ్నికి ఆ కాకి విలవిలా తన్నుకుని మరణించింది.ఆ కౌశికుడు తన తపః శక్తికి గర్వపడుతూ భిక్ష కోసం ఆ రోజు ఒక ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాం దేహి అని భిక్షకై కేకవేశాడు. ఆ ఇంటి ఇల్లాలి పేరు సుమతి.మహా పతివ్రత.కౌశికుని కేకవిని బయటకు వచ్చి స్వామి భిక్ష తెస్తానని లోపలికి వెళ్ళింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

Friday, February 27, 2009

పితృదేవోభవ

ఇప్పటి వరకూ మాతృదేవోభవ - మాతృమూర్తి గురించి కొంత తెలుసుకున్నాము.తరువాతి స్థానం పితృదేవోభవ - తండ్రిది. తండ్రి, తల్లి బిడ్డకు జన్మనిస్తే, తండ్రి పోషణ చేసి, విద్యాబుద్ధుల్ని నేర్పి,ఉన్నత వ్యక్తిగా బిడ్డను తీర్చిదిద్దుతాడు.అందుకనే తండ్రిని మన సమాజం తల్లి తరువాత స్థానంలో గౌరవించింది.తండ్రిమాట పాలించి, లోకానికి ఆరాధ్యుడైన శ్రీ శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడైనాడు.తండ్రి కైకకు ఇచ్చిన వరాలు నెరవేర్చటానికి,పదునారేండ్ల ప్రాయంలో వనవాసం చేసాడు.అంతేకానీ నీవు మాట ఇస్తే నేనెందుకు వనవాసం చేయాలి అనలేదు.తండ్రిమాట వేదవాక్కుగా భావించాడు.తరువాత భరతుడు వచ్చి నీ రాజ్యం నీవే పాలించాలి.నాకు అర్హత లేదు అని బ్రతిమిలాడినా,వారి వంశచరిత్రను సత్య వాక్య పాలనను గురించి వివరంగా బోధించి తనమాట మీదనే నిలబడి పితృవాక్యపాలనను గురించి వివరంగా బోధించి, తనమాట మీదనే నిలబడి పితృవాక్య పాలన చేసి దేవుడై మనందరి చేతా పూజించబడుతున్నాడు.కనుక ప్రతి బిడ్డ కూడా తల్లిని,తండ్రినీ గౌరవించి, వారిని ఆదరించి ప్రేమగా చూస్తే వారిని దేవుడు కూడా కరుణిస్తాడు.తల్లిని, తండ్రినీ సేవించి ముమ్మారు ప్రదక్షిణ చేసిన గణపతి తొలివేల్పుగా పూజలందుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే..!!ఇటువంటిదే మరొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...