Friday, December 26, 2008

పాలు విరక్కుండా ఉండాలంటే.....

గృహిణులకు చిట్కాలు~:


పాలు విరుగుతాయని అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలో "మన అమ్మ" చిట్కా పాలు విరక్కుండా ఉండాలంటే, పాలల్లో 2 పుదీనా ఆకులు వేయాలి.

అందమైన పాదాల కోసం ....

సౌందర్య చిట్కా~: అందమైన పాదాల కోసం


పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో "మన అమ్మ"చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.

అందమైన పాదాల కోసం

సౌందర్య చిట్కా~: అందమైన పాదాల కోసం


అందమైన ముఖము, చేతులు తరువాత ప్రధాన దృష్టి పడేదీ ..పాదాల మీదే!!పాదాల అందం కోసం ఇంట్లోనే ఏం చేయాలో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో.. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి.ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి,ఆరాక మామూలుగా కడిగేసుకోండి.దీనివల్ల నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.

అందమైన చేతుల కోసం...

సౌందర్య చిట్కా~: అందమైన చేతుల కోసం


చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవి గా చెప్పుకున్నాం కదా..ఈ పొస్ట్ లో కూడా ఒక మంచి సులువైన "మన అమ్మ"చిట్కాను చెప్పబోతున్నాను.ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి.

అందమైన, ఆరోగ్యమైన కనులకోసం ....

సౌందర్య చిట్కా~: అందమైన, ఆరోగ్యమైన కనులకోసం


కళ్ళు మన శరీరంలో ప్రధానమైనవి.అందుకే మన పెద్దలు "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న కనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? పాతకాలంలో ఐతే కళ్ళకు చక్కగా కాటుక పెట్టుకునేవారు స్త్రీలతో పాటు పురుషులు కూడా!!కానీ రాను రాను కాటుక పెట్టుకునే వారు తక్కువ అయ్యారనే చెప్పాలి.కాటుక లో ఉండే సుగుణాలు చెప్పటం అసాధ్యం.మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంటుంది.అందుకే ఈ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి కాటుకకు సంబంధించిన చిట్కాను అందించబోతున్నాను.దీన్ని మీరే ఇంట్లో తయారుచేసుకుని మీ కళ్ళ సమస్యలను పోగొట్టుకోవచ్చు.దీన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.దీనికి కావలసినవి..పెద్ద ఉల్లిపాయ రసం, మంచి తేనె, ఒక్క నలుసు పచ్చ కర్పూరం.ఒక్క బొట్టు ఉల్లిరసం తీసుకుని ఒక ప్లేట్ లో వేసి అందులో ఒక్క చుక్క తేనె,ఒక్క నలుసు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే కాటుక వస్తుంది. దీన్ని రోజూ కళ్ళకు పెట్టుకోవటం వల్ల కంట్లోని పొర, నలుసులు, దృష్టి లోపం వంటి సమస్యలు కేవలం 20 రోజుల్లోనే నివారించబడతాయి.

Thursday, December 25, 2008

అందమైన పెదవుల కోసం

సౌందర్య చిట్కా~: అందమైన పెదవుల కోసం


పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా.జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.

అందమైన పెదవుల కోసం .....

సౌందర్య చిట్కా~: అందమైన పెదవుల కోసం


పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా.జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.

అందమైన చేతుల కోసం ...

సౌందర్య చిట్కా~: అందమైన చేతుల కోసం


చాలా మంది ముఖానికి ఇచ్చినంత ప్రాధాన్యం చేతులకు ఇవ్వరు.కానీ అందమైన ముఖం చూసాక అందరి దృష్టీ పడేది ప్రధానంగా చేతుల మీదే..మరి అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న చేతుల కోసం "మన అమ్మ" చిట్కా..రాత్రిపూట పడుకునే ముందుఆలివ్ ఆయిల్ తో కాసేపు మర్ధనా చేయండి.ఇలా చేస్తూ ఉన్నప్పుడే మీరు మార్పుని గమనించవచ్చు.కనీసం ఒక 40 రోజులపాటు చేసి చూడండి..ఉదయాన్నే మీ చేతులు కోమలంగా తయారవుతాయి.ఇంకా..డిటర్జెంట్ లాంటివి ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా ఆలివ్ ఆయిల్ తో మర్దనా చేసుకోవటం మర్చిపోవద్దు.

అందమైన మోము కోసం..

సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు "మన అమ్మ" చిట్కాను తెలుసుకుందాం.. గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.

Sunday, December 21, 2008

(5 వ భాగం) మాతృదేవో భవ – గరుత్మంతుని మాతృభక్తి,శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం

(5 వ భాగం) మాతృదేవో భవ – గరుత్మంతుని మాతృభక్తి,శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం

తన తల్లి ఐన వినత సమక్షం లో, పిన తల్లి ఐన కదృవను పిలిచి గరుత్మంతుడు ఈ విధంగా పలికాడు."పినతల్లీ!!నీవు కోరిన విధంగా అమృతం తెచ్చి ఇచ్చాను.నన్నూ, నా తల్లినీ, దాస్య విముక్తులను చేయమని" కోరాడు.అమృతమును చూసిన అనందం లో కదృవ, ఆ రోజు నుంచి వారిని దాస్య విముక్తులను చేసింది.ఆ తర్వాత కదృవ కుమారులంతా అమృతపానం చేయటానికి ముందుగా నదిలోకి స్నానం చేయటానికి వెళ్తారు.కదృవ, వినతకు చేసిన మోసం ఇంద్రునికి తెలుసు కాబట్టి వారికి అమృతభాండం దక్కకూడదని తిరిగి స్వర్గలోకానికి తీసుకు వెళ్ళిపోయాడు.ఆత్రంగా వచ్చిన కదృవ కొడుకులు దర్భల మీద అమృతభాండం లేకపోవటం చూసి ఆక్రోశించి, బాధపడి కొంచెం ఐనా దర్భల మీద అమృతం ఒలికిందేమోనని నాకారు.పదునుగా ఉన్న దర్భలవల్ల నాగుల నాలుక రెండుగా చీలింది.ఆనాటి నుంచి నాగజాతికి రెండు నాలుకలు యేర్పడ్డాయి.తల్లికి దాస్య విముక్తి చేసిన గరుత్మంతుడు స్వామి అనుగ్రహిస్తే సాక్షాత్త్ శ్రీ మహావిష్ణువుకు వాహనంగా ఉంటానని కోరాడు.గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చుకుని,స్వామి,గరుక్మంతుణ్ణి వాహనంగా స్వీకరించారు.

తల్లిని గౌరవించి, ఆమెకు దాస్యవిముక్తిని చేసిన గరుత్మంతుడు స్థితికారుడైన శ్రీమన్నారాయణునికే వాహనమయ్యాడు.కనుక ప్రతివారూ ముందుగా తల్లిని పూజించి, గౌరవిస్తే ఉన్నత పదవులు వారి వద్దకే వెతుక్కుంటూ వస్తాయనటం లో సందేహం లేదు.

(4 వ భాగం) మాతృదేవో భవ – గరుక్మంతుని పుట్టుక,దాస్య విముక్తి

(4 వ భాగం) మాతృదేవో భవ – గరుక్మంతుని పుట్టుక,దాస్య విముక్తి


తనను దాస్యచెర నుండి విముక్తి చేసే కొడుకు కోసం వినతకి ఒక పుత్రుడు కలిగాడు.అతనే మహా పరాక్రమశాలి ఐన గరుక్మంతుడు.గరుక్మంతుడు పెద్దవాడు అయ్యాక, తాను తల్లి ఐన వినత, కద్రువకు, ఆమె పిల్లలకు ఎందుకు బానిసలుగా ఉన్నామని అడుగగా వినత గతంలో జరిగిన సంఘటనను వివరించింది.అది విని గరుక్మంతుడు పినతల్లి వద్దకు వెళ్ళి మమ్మల్ని ఈ దాస్యం నుండి విముక్తులను చేయమని అడిగాడు.కద్రువ ఆలోచించుకుని తన పిల్లలకు మరింత బలం చేకూరి అమరులుగా ఉండాలని ఆలోచించి, స్వర్గలోకంలో ఉన్న అమృతం తీసుకువచ్చి ఇస్తే, మీకు దాస్య విముక్తి చేస్తానని పలికింది. అది విన్న గరుక్మంతుడు సరే!అని పలికి స్వర్గలోకనికి వెళ్ళి అమృతకలశం దగ్గర ఉన్న కావలివారిని తన పరాక్రమంతో ఓడించి అమృతకలశం తీసుకువస్తుండగా ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు.ఇంద్రుడు వజ్రాయుధం మీద గౌరవం తో, తన రెక్కలోని ఒక ఈకను వజ్రాయుధానికి సమర్పించి గౌరవించాడు.ఇంద్రుడు, "వైనతేయుడు అనగా గరుక్మంతుడి" శక్తి పరాక్రమాలకు సంతోషించి ఈ విధంగా పలికాడు."నాయనా!!ఇది పవిత్రమైన అమృతభాండం. ఇది ఎట్టి పరిస్థితి లోనూ నీచులకు లభించరాదు".అని పలికి, కదృవ గరుక్మంతుని తల్లికి చేసిన మోసం గురించి కూడా తెలియచేసాడు ఇంద్రుడు.అప్పుడు గరుక్మంతుడు దాస్య విముక్తికై కదృవ అమృతం కోరిన సంగతి తెలిపి, ఇది నాకు కావలెనని అర్ధించాడు.ఇంద్రుడు సరేనని పలికి అమృతకలశాన్ని గరుక్మంతునికి జాగ్రత్తగా సమర్పించాడు.గరుక్మంతుడు అమృతకలశాన్ని తెచ్చి దర్భలు పరచి వాటి మీద పవిత్రమైన అమృతకలశాన్ని ఉంచాడు.పవిత్రమైన అమృతకలశం కదృవ పిల్లలకు అందిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

(3 వ భాగం) మాతృదేవో భవ – అనూరుడి పుట్టుక

(3 వ భాగం) మాతృదేవో భవ – అనూరుడి పుట్టుక


వినత తన స్థితికి బాధ పడుతూ, తనకి ఈ దాస్యం నుండి విముక్తి ఎప్పుడా?? అని విచారిస్తూ ఉండేది. కొంతకాలానికి వినత గర్భవతి అయ్యింది.కనీసం తనకు పుట్టే బిడ్డ ఐనా తనకు ఈ దాస్యచెర నుండి విముక్తి చేస్తాడనే ఆశ తో, నెలలు నిండినా కూడా ప్రసవం జరగకపోయేసరికి గర్భం పగలుకొట్టుకుంది.బయటకు వచ్చి, అప్పుడప్పుడే అవయవాలు ఏర్పడుతున్న ఆ బిడ్డ ఇంకా తొడల వరకు మాత్రమే ఏర్పడి అసంపూర్ణంగా ఉన్నాడు.బయటకు వచ్చిన ఆ బిడ్డ తల్లి చేసిన పనికి విచారించి, తన తల్లితో "అమ్మా!!ఎందుకు ఇంత తొందర పడ్డావు?అని ప్రశ్నించాడు".అప్పుడు వినత తన బాధ చెప్పుకుని , "నా దాస్యచెర నుండి విముక్తురాలిని చేస్తావనే ఆశతో తొందరపడ్డాను నాయనా" అని పలికింది. “అమ్మా!! నీవు చేసిన ఈ పని వల్ల కాళ్ళు పూర్తిగా ఏర్పడక ముందే పుట్టాను.అందువల్ల ఈ కార్యాన్ని నేను సాధించలేను.నిన్ను దాస్య విముక్తిని చేసేవాడు నీ కడుపున త్వరలో పుడతాడు.అతడు మహా బలశాలి, పరాక్రమవంతుడూ అవుతాడు.కనుక ఈసారి తొందరపడకుండా, అతను గర్భం లోనుండి సకాలంలో, సక్రమంగా పుట్టేంతవరకూ వేచి ఉండవలసింది"గా తన తల్లిని కోరి, తాను సూర్యుని రథసారధిగా ఉంటానని, ఆజ్ఞ ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు.కొడుకు పలికిన మాటలకు వినత సంతోషించి దీవించింది.ఇతని పేరు అనూరుడు..అంటే తొడలు లేనివాడని అర్ధం.ఇతనే సూర్యభగవానుని రథసారథి.అనూరుడు పలికిన విధంగా వినతకు మరో బిడ్డ జన్మించి తనను దాస్యం నుండి విముక్తి కలిగించాడో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో ....

(2 వ భాగం) మాతృదేవో భవ – కదృవ మోసం

(2 వ భాగం) మాతృదేవో భవ – కదృవ మోసం


అక్కడి నుంచి వినత వెళ్ళగానే కదృవ దీపం సహాయంతో ఆ గుఱ్ఱాన్ని మొత్తం వెతికింది.ఎక్కడా ఒఖ్ఖ మచ్చ కూడా కనిపించలేదు.కదృవకు భయం వేసింది..తాను వేసిన పందెం గురించి..ఈ విషయం వినత కు తెలిస్తే తాను జీవితాంతం వినతకు దాస్యం చేయాలి..ఎలాగైనా తాను ఈ పందెం లో ఓడిపోలేదని వినతను నమ్మించాలి..ఎలాగ?? అని ఆలోచిస్తున్న కదృవకు మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆలోచన వచ్చిందే తడవు గా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి, తన పిల్లలైన నాగుల తో, తనకొచ్చిన కష్టం చెప్పుకొని ఎవరైనా ఎవరైనా వెళ్ళి గుఱ్ఱం తోక చివర చుట్టుకొని మచ్చలాగా కన్పించమని అడిగింది.కానీ ఆమె పిల్లలు అది ధర్మ విరుధ్ధమని, తాము అలా మోసం చేయలేమని తెగేసి చెప్పారు.అది విన్న కదృవ క్రోధంతో వారందరికీ శాపమివ్వబోతుండగా, ఆఖరి కుమారుడు వచ్చి "అమ్మా!! శాంతించు..నీ కోసం నేను ఈ పని చేస్తానని తల్లికి మాట ఇచ్చాడు.మరుసటి ఉదయం వినత, కదృవ గుఱ్ఱాన్ని పరీక్షించే సమయానికి కదృవ ఆఖరి కుమారుడు తన తల్లి చెప్పిన విధంగా తోకకు చుట్టుకొని కనిపించాడు. అది చూసిన కదృవ, వినతకు దూరం నుండి ఆ దృశ్యాన్ని చూపించి "చూడు చూడు..ఆ గుఱ్ఱానికి ఎంత పెద్ద మచ్చ ఉన్నదో!! కాబట్టి ఈ పందెం లో నేనే గెలిచాను.ఈ రోజు నుంచి నువ్వు నా దాసీవి అన్నది".పాపం ఇవేవీ తెలియని వినత తాను నిజంగానే పందెం లో ఓడిపోయానని, తొందరపడి పందెం కాసినందుకు విచారించి, ఆ రోజు నుంచి కదృవకు దాస్యం చేయ సాగింది.వినతకు ఈ దాస్యచెర నుంచి విముక్తి కలిగిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...






(1 వ భాగం) మాతృదేవో భవ - వినత,కదృవ పందెం..

మాతృదేవో భవ - వినత,కదృవ పందెం..


పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కదృవ ఒకరోజున ముచ్చటించుకుంటున్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటటే, కదృవ నాగజాతికి జన్మనిచ్చింది. వినతకు ఇంకా సంతాన భాగ్యం కలుగలేదు. వారిద్దరూ ఒకరోజున తెల్లని, అందమైన గుఱ్ఱాన్ని చూసారు..వినత ఆ గుఱ్ఱాన్ని చూసి ముచ్చటపడి, "కదృవా!!ఆ గుఱ్ఱం చూడు.. ఎంతో అందంగా, ఒక్క మచ్చైనా లేకుండా చాలా తెల్లగా ఎంత బావుందో..అని ఆ గుఱ్ఱాన్ని చూసి మురిసిపోయింది. అది విన్న కదృవ "లేదు, లేదు ఆ గుఱ్ఱానికి ఒక నల్లని మచ్చ ఉన్నది అన్నది".ఈ విషయంలో ఇద్దరికీ వాదన, పంతం పెరిగాయి.ఇద్దరూ ఒక పందెం వేసుకున్నారు. గుఱ్ఱానికి మచ్చ ఉంటే వినత జీవితాంతం కదృవకు దాసీ గా ఉండాలి. మచ్చ లేకుంటే కదృవ, వినతకు జీవితాంతం దాసీ గా ఉండాలి..అని పందెం వేసుకున్నారు.పందెం ఐతే ఒప్పుకున్నది కానీ, కదృవకు కొంచెం భయం వేసి పైకి బింకం గా ఇప్పుడు చీకటి పడింది కదా!! రేపు చూద్దాం అని అప్పటికి తప్పించుకుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఈ పందెం లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో....




మాతృదేవో భవ~:

మాతృదేవో భవ~:

మన సమాజంలో తల్లికి ప్రధమస్థానం కల్పించారు. తల్లికి ఎందుకని అంతటి విశిష్ట స్థానం లభించింది?? తల్లి తన గర్భంలో శిశువు ఏర్పడ్డ దగ్గర నుంచి ఎన్నో కష్టాలను భరించి, మరో జన్మ అనిపించే ప్రసవ వేదనను భరించి, బిడ్డకు జన్మనిస్తుంది. అంతటి తో ఐపోలేదు..ఇంకా శ్రమకోర్చి బిడ్డ కోసం తను ఆహార నియమాలను పాటించి, తన రక్తాన్ని పాలుగా మార్చి, బిడ్డ కడుపు నింపుతుంది. బిడ్డ ఎదుగుదలను చూసి నిత్యం పరవశిస్తుంది. అందుకనే మాతృమూర్తికి మన భారతదేశం ప్రధమ స్థానం కల్పించింది.మరి అటువంటి మాతృమూర్తి సేవలో, తరించిన ఒక మహనీయుని గురించి తెలుసుకుందాం...తదుపరి పోస్ట్ లో...




తెలుగు ఆణిముత్యాలు - జీవన శైలి

మనకు మహాభారతం ఎన్నో విషయాలను తెలియ చెప్పింది.మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే విషయాలను ఈ ఇతిహాసమును నిశితముగా గమనిస్తే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి.మనం తోటివారి పట్ల ఎలా ఉండాలో "విదురుడు" ఒక శ్లోకం ద్వారా చక్కగా చెప్పారు.పరుల ఏ పనుల వల్ల మనకు బాధ, దుఃఖం కలుగుతాయో, తిరిగి మనము ఆ పనులను పరులకు చేయకుండా ఉండటమే పరమ ధర్మమని విదురుడు బోధించాడు. ఈ విషయాన్ని మనకు చక్కటి పద్య రూపంలో వివరముగా చెప్పారు.మరి ఆ పద్యాన్ని మనము కూడా నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పే ప్రయత్నం చేద్దాం..

"ఒరులేవి యొనరించిన

నరవర యప్రియము తనమనమునకు దా

నొరులకు నవిసేయ కునికి

పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్"


ఆణిముత్యంలాంటి ఈ పద్యం ప్రతివారు నేర్చుకుంటే, ఎదుటివారికి బాధ కలిగించే పనులు చేయకుండా ఉంటారు.కనుక ప్రతి తల్లి తమ పిల్లలకు చిన్న నాటి నుంచే ఇటువంటి మంచి విషయాలను నేర్పాలి.తద్వారా సమాజం కూడా బావుంటుంది.ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక , మంచి, విషయాలను తెలుసుకుందాం.. తదుపరి పోస్ట్ లో....


అందమైన మోము కోసం - పచ్చిపాలతో....

సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం పచ్చిపాలతో..


ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు.అదేంటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కా లో..

పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.

అందమైన మోము కోసం.- టొమాటో, బీట్రూట్, క్యారట్...

సౌందర్య చిట్కా~: అందమైన మోము కోసం.


ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం "మన అమ్మ" చిట్కా లో..


టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

Friday, December 12, 2008

సత్సంగ మహిమ ~: సత్పురుషుల సాన్నిహిత్య మహిమ

సత్సంగ మహిమ ~: సత్పురుషుల సాన్నిహిత్య మహిమ


విశ్వామిత్ర మహర్షి ఆలోచనలో పడతాడు..తాను ఎవరి దగ్గరైనా కల్మషం లేకుండా గడిపానా??. అని జ్ఞప్తికి తెచ్చుకుని, వశిష్ఠ మహర్షి పై విశ్వామిత్రునకు చాలా మత్సరం, అసూయ ఉండేవి.అందరూ ఆయనను "బ్రహ్మర్షి" అని, తనను "రాజర్షి" అని సంబోధిస్తారు. ఈ కోపంతో వశిష్ఠ మహర్షి యొక్క నూరు మంది కొడుకులను చంపాడు.అందువలన విశ్వామిత్రునకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకొని, పశ్చాత్తాపం తో, వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి, తాను చేసిన పాపకార్యం చెప్పి, క్షమించమని వేడుకున్నాడు.వశిష్ఠ మహర్షి ఏమాత్రం కోపం లేనివాడై, ఈ విధంగా పలికాడు.

"మహర్షీ!! అన్నిటికీ అసూయే కారణం. అసూయను జయించలేకపోతే అన్నీ అనర్ధాలే". అని హితబోధ చేసి, విశ్వామిత్రుణ్ణి ఆదరించి క్షమించాడు. ఆయన దగ్గర తాను గడిపిన ఆ సమయం గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా అహంకారం వదిలి ఆ పుణ్యఫలం ధారపోయగా భూమి పడిపోవటం ఆగిపోవటమే కాక, మరలా ఆదిశేషుని శిరస్సులపై భద్రంగా నిలిచింది.ఈ సంఘటనతో విశ్వామిత్రునకు ఙ్ఞానోదయం కలిగి తన ప్రశ్నకు సమాధానం దొరికింది.అంతేకాక తన తపః శక్తి అంతా కలిసినా వశిష్ఠ మహర్షి సమక్షంలో గడిపిన క్షణాల పుణ్యమే ఎక్కువ అని సత్సంగ మహిమ, విలువ కూడా తెలిసి అహంకారం తొలగింది.కనుక సత్ సాంగత్యం ఎంతటి పాపాన్నైనా దహించి మనసు నిర్మలమవ్వటమేకాక, మోక్షప్రాప్తికి కూడా సహకారిగా మారుతుంది.

సత్సంగ మహిమ ~: ఆదిశేషుడు-భూ భార బాధ్యత

సత్సంగ మహిమ ~: ఆదిశేషుడు-భూ భార బాధ్యత

వశిష్ట విశ్వామిత్రులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని ఆదిశేషుని వద్దకు వచ్చిన విశ్వామిత్రునికి గట్టిపరీక్ష ఎదురైంది.తన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు తన తలమీద భూమాతభారాన్నికాసేపు ఎవరైనా భరిస్తే మీకు సమాధానం చెప్తానని పలుకగా, విశ్వామిత్రుడు తన తపః శక్తిని వినియోగించి ఆ బాద్యతను నేను స్వీకరిస్తానని చెప్పి, ఆ ప్రయత్నం లో విఫలమౌతాడు.అప్పుడు ఆదిశేషుడు "మహర్షీ!!భూమి పడిపోతున్నది.ప్రళయం సంభవిస్తుంది.నీ మాట నమ్మి భూమిని దించాను.కనీసం భూమిని మరలా నా తలపై ఉంచు అన్నాడు".అది విని విశ్వామిత్రుడు ఏదైనా ఉపాయం చెప్పి నీవే ఈ ఉపద్రవాన్ని అరికట్టమని ప్రాధేయపడ్డాడు. అంతట "ఆదిశేషుడు నీ తపః శక్తి అంతా వ్యర్ధమైపోయింది.కానీ నీవు ఏ మహాపురుషుని వద్దనైనా నిష్కల్మషంగా గడిపితే అది ధారపోయి.భూగోళం మరలా నా శిరస్సులపై చేరుతుంది అని ఉపాయం చెప్పాడు".ఆ ఉపాయం ఏమిటో, ఈ ప్రయత్నం లో ఐనా విశ్వామిత్రుడు సఫలీకృతుడు అయ్యాడో లేదో తెలుసుకుందాం తదుపరిపోస్ట్ లో......

సత్సంగ మహిమ ~: ఆదిశేషుడు-విశ్వామిత్రుని సంభాషణ

సత్సంగ మహిమ ~:

విశ్వామిత్రుని చూసిన ఆదిశేషుడు "మహర్షీ!! మీ ప్రశ్నకు ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను.నా తల మీద భూ భారం ఉంది.నేను ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భూమి ఒరిగి అల్లకల్లోలం అవుతుంది.ఈ భారం ఎవరైనా కాసేపు మోస్తే నీ ప్రశ్నకు బదులు చెప్పగలనని అన్నాడు".అది విని "విశ్వామిత్రుడు ఎవరిదాకా ఎందుకు??నా తపః శక్తి కొంచెం ధారపోసి భూమిని నిలబెడతాను.కిందకు దించు అన్నాడు".సరే అని ఆదిశేషుడు భూమిని శూన్యంలోకి దించగానే భూమి పడిపోనారంభించింది.వెంటనే విశ్వామిత్రుడు తన తపః శక్తి లో పావు వంతు ధారపోసి భూగోళాన్ని నిలబెట్టాలని చూచాడు.ఐనా ఆగలేదు..ఇంకా పడిపోతున్నది.ఈసారి సగం తపః శక్తిని ధారపోశాడు....ఐనా లాభం లేక పొయింది.చివరిగా తాను ఎన్నో వేల సంవత్సరాలు కష్టపడి సాధించిన తపఃశక్తి మొత్తం ధారపోసి భూగోళాన్ని నిలబెట్టాలని ప్రయత్నించాడు విశ్వామిత్రుడు.ఐనా ఫలితం శూన్యం.తరువాత ఏం చేయాలో పాలుపోక ఆలోచించసాగాడు.. తన మాటను నమ్మి భూభారాన్ని తనకు అప్పగించిన ఆదిశేషుని మోము వంక చూడటానికే వణుకుపుట్ట సాగింది విశ్వామిత్రునికి..భూమిని నిలబెట్టాలని చూసిన విశ్వామిత్రుని ప్రయత్నం సఫలం ఐనదో లేదో తెలుసుకుందాం.. తదుపరి పోస్ట్ లో.....


సత్సంగ మహిమ~:విశ్వామిత్రుని సందేహం

సత్సంగ మహిమ~: విశ్వామిత్రుని సందేహం

సత్సంగం అనేది ఎంతో విలువైనది.దాని మహత్యం చెప్పనలవి కాదు.ఈ కలియుగం లో మానవులను ఎన్నో వ్యామోహాలు పట్టి పీడిస్తున్నాయి.ఈనాడు వృద్దులు కూడా మంచి విషయాలు తెలుసుకోవటానికి సిధ్దం గా ఉన్నా ఇంట్లో వ్యతిరేక ధోరణి ఉంటోంది.అటువంటిది ఇంకా యవ్వనం లో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళకు మాత్రం దీని గురించి ఎలా తెలుస్తుంది???టి.వి.లో చెత్త సీరియల్స్, చెత్త కార్యక్రమాలు చూస్తూ మెదడును చెత్తకుండీగా చేసుకుంటున్నాం.కానీ ఒకసారైనా సత్సంగం గురించి మనందరం తెలుసుకుంటే కొంతలో కొంతైనా మంచిని అలవర్చుకోవటానికి దోహదపడుతుంది.అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి విశ్వామిత్ర మహర్షికి ఒక సందేహం కలిగింది.అందరూ వశిష్ట మహర్షిని మాత్రమే ఎంతో గౌరవిస్తున్నారని, తనకు అంత గౌరవం లేదని అసూయ కలిగింది."నేను మాత్రం ఎందులో తక్కువ? తపోనిష్టుడనే కదా"??!!అని ఈ విషయమై మహర్షులను కలువగా, వారంతా ఆ ఆదిశేషుడే నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడని అన్నారు.విశ్వామిత్రుడు ఆదిశేషుని వద్దకు వెళ్ళాడు.ఆదిశేషుడు తల మీద భూభారం మోస్తున్నాడు.మరో ప్రక్క తన దేహమే పానుపుగా మలచి శ్రీలక్ష్మినారాయణనుకి కొలువుగా తీర్చాడు.అక్కడికి వచ్చిన విశ్వామిత్రుడు ఆదిశేషునికి అభివాదము చేసి,తన సందేహము అడిగాడు.నీవైనా వశిష్టుడు నాకంటే ఎందులో గొప్పవాడో చెప్పమని అడిగాడు.ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి పోస్ట్ లో .....

Saturday, December 6, 2008

పంచదార బాటిల్ కు చీమలు పట్టకుండా...

గృహిణులకు చిట్కాలు~:


పంచదార బాటిల్ ను ఎంత జాగ్రత్తగా ఉంచినప్పటికీ చీమలు పట్టేస్తాయి.వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా!! ఐతే మీ కోసమే "మన అమ్మ" చిట్కా!!లవంగం మన అందరికీ తెలిసిందే కదా!!4,5 లవంగం మొగ్గలను పంచదార బాటిల్ లో వేయండి.అంతే.. చీమలు దాని దరి దాపుల్లోకి కూడా రావు.

సింకు లో నీళ్ళు పోక ఇబ్బంది పడుతున్నారా??

గృహిణులకు చిట్కాలు~:

సింకు లో నీళ్ళు పోక అప్పుడప్పుడూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా!కొద్దిగా అడ్డుపడిన పదార్ధాలైతే నీళ్ళు బాగా ఫోర్స్ గా పోస్తే అడ్డు పోతుంది.కానీ అప్పటికీ పోకపోతే దీనికి ఏం చేయలో "మన అమ్మ" చిట్కా. ఒక మూత వెనిగర్ ని ఒక కప్పు నీళ్ళలో కలిపి సింకు మోరీ లో పోయండి.ఒక అరగంట పాటు వదిలేసి, తరువాత సులువు గా శుభ్ర పడుతుంది.

అన్నం ముద్దగా అవుతోందా??

గృహిణులకు చిట్కాలు~:

రోజూ వండేదే ఐనా ఒక్కోసారి అన్నం ముద్ద ముద్దగా అవుతుంది. ఇది సర్వసాధారణం.కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు సరిగ్గా భోజనం చేయకపోతే మనకే బాధ.అలా బాధ పడకుండా ఉండాలంటే "మన అమ్మ" చిట్కా!! అన్నం ఉడికేటప్పుడు కొంచెం నీరు ఉండగానే ఒక స్పూన్ వంటనూనె వేయండి.దీనివల్ల అన్నం పొడి పొడిగా, మల్లెపూవులా మెత్తగా కూడా ఉంటుంది.

నూనె పీల్చకుండా..

గృహిణులకు చిట్కాలు~:

ఈ రోజుల్లో పెరగని నిత్యావసర వస్తువులు లేవు. మధ్య, పేద తరగతుల వారు కొనలేని పరిస్థితి.కానీ తప్పదు కదా!! నూనె కూడా చాలా ఖరీదు ఐంది.ఏవైనా నూనె పీల్చే పిండి వంటలు చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం కదా!! మరి అలా నూనె పీల్చకుండా ఉండాలంటే "మన అమ్మ" చిట్కా! బాండీలో నూనె పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మీరు చేయాలనుకున్న వంటలు చేసుకోండి. దీనివల్ల నూనె ఎక్కువగా పీల్చదు. ప్రయత్నించి చూడండి.

మెత్తబడిన టమాటాలకు ఒక మంచి చిట్కా!!!

గృహిణులకు చిట్కాలు~:

ఇప్పుడు కూరగాయల రేట్లు ఎంత మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే..అందులో టమాటాల ఖరీదు వేరే చెప్పనక్ఖర్లేదు.మరి అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న టమాటాలు మెత్త మెత్తగా ఉంటే అటు పారేయలేము.. అలా అని ఉపయోగించుకోలేము.అలాంటప్పుడు ఏం చేయాలో "మన అమ్మ" చిట్కా!! ఉప్పు వేసిన నీటిలో ఒక రాత్రి నాన బెట్టండి. తరువాత రోజు మామూలుగా తయారవ్వటమే కాకుండా, 2,3 రోజుల వరకు బావుంటాయి.

కూరగాయలు వడలిపోయాయా??

గృహిణులకు చిట్కాలు~:

1.కూరగాయలు ఎక్కువగా కొని రోజూ వండుతున్నప్పటికీ, ఫ్రిజ్ లో పెట్టినా కూడ ఒక్కోసారి వడలిపోయినట్లుగా అవుతుంటాయి.అలా వడలిపోయినట్లు ఉంటే వాటిని తాజాగా చేసేందుకు ఒక చిట్కా.నిమ్మరసం వేసిన నీటిలో వాటిని ఒక రాత్రి నానబెట్టండి.మళ్ళీ తాజాను సంతరించుకుంటాయి