Sunday, December 21, 2008

(3 వ భాగం) మాతృదేవో భవ – అనూరుడి పుట్టుక

(3 వ భాగం) మాతృదేవో భవ – అనూరుడి పుట్టుక


వినత తన స్థితికి బాధ పడుతూ, తనకి ఈ దాస్యం నుండి విముక్తి ఎప్పుడా?? అని విచారిస్తూ ఉండేది. కొంతకాలానికి వినత గర్భవతి అయ్యింది.కనీసం తనకు పుట్టే బిడ్డ ఐనా తనకు ఈ దాస్యచెర నుండి విముక్తి చేస్తాడనే ఆశ తో, నెలలు నిండినా కూడా ప్రసవం జరగకపోయేసరికి గర్భం పగలుకొట్టుకుంది.బయటకు వచ్చి, అప్పుడప్పుడే అవయవాలు ఏర్పడుతున్న ఆ బిడ్డ ఇంకా తొడల వరకు మాత్రమే ఏర్పడి అసంపూర్ణంగా ఉన్నాడు.బయటకు వచ్చిన ఆ బిడ్డ తల్లి చేసిన పనికి విచారించి, తన తల్లితో "అమ్మా!!ఎందుకు ఇంత తొందర పడ్డావు?అని ప్రశ్నించాడు".అప్పుడు వినత తన బాధ చెప్పుకుని , "నా దాస్యచెర నుండి విముక్తురాలిని చేస్తావనే ఆశతో తొందరపడ్డాను నాయనా" అని పలికింది. “అమ్మా!! నీవు చేసిన ఈ పని వల్ల కాళ్ళు పూర్తిగా ఏర్పడక ముందే పుట్టాను.అందువల్ల ఈ కార్యాన్ని నేను సాధించలేను.నిన్ను దాస్య విముక్తిని చేసేవాడు నీ కడుపున త్వరలో పుడతాడు.అతడు మహా బలశాలి, పరాక్రమవంతుడూ అవుతాడు.కనుక ఈసారి తొందరపడకుండా, అతను గర్భం లోనుండి సకాలంలో, సక్రమంగా పుట్టేంతవరకూ వేచి ఉండవలసింది"గా తన తల్లిని కోరి, తాను సూర్యుని రథసారధిగా ఉంటానని, ఆజ్ఞ ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు.కొడుకు పలికిన మాటలకు వినత సంతోషించి దీవించింది.ఇతని పేరు అనూరుడు..అంటే తొడలు లేనివాడని అర్ధం.ఇతనే సూర్యభగవానుని రథసారథి.అనూరుడు పలికిన విధంగా వినతకు మరో బిడ్డ జన్మించి తనను దాస్యం నుండి విముక్తి కలిగించాడో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో ....

No comments:

Post a Comment