Sunday, December 21, 2008

(4 వ భాగం) మాతృదేవో భవ – గరుక్మంతుని పుట్టుక,దాస్య విముక్తి

(4 వ భాగం) మాతృదేవో భవ – గరుక్మంతుని పుట్టుక,దాస్య విముక్తి


తనను దాస్యచెర నుండి విముక్తి చేసే కొడుకు కోసం వినతకి ఒక పుత్రుడు కలిగాడు.అతనే మహా పరాక్రమశాలి ఐన గరుక్మంతుడు.గరుక్మంతుడు పెద్దవాడు అయ్యాక, తాను తల్లి ఐన వినత, కద్రువకు, ఆమె పిల్లలకు ఎందుకు బానిసలుగా ఉన్నామని అడుగగా వినత గతంలో జరిగిన సంఘటనను వివరించింది.అది విని గరుక్మంతుడు పినతల్లి వద్దకు వెళ్ళి మమ్మల్ని ఈ దాస్యం నుండి విముక్తులను చేయమని అడిగాడు.కద్రువ ఆలోచించుకుని తన పిల్లలకు మరింత బలం చేకూరి అమరులుగా ఉండాలని ఆలోచించి, స్వర్గలోకంలో ఉన్న అమృతం తీసుకువచ్చి ఇస్తే, మీకు దాస్య విముక్తి చేస్తానని పలికింది. అది విన్న గరుక్మంతుడు సరే!అని పలికి స్వర్గలోకనికి వెళ్ళి అమృతకలశం దగ్గర ఉన్న కావలివారిని తన పరాక్రమంతో ఓడించి అమృతకలశం తీసుకువస్తుండగా ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు.ఇంద్రుడు వజ్రాయుధం మీద గౌరవం తో, తన రెక్కలోని ఒక ఈకను వజ్రాయుధానికి సమర్పించి గౌరవించాడు.ఇంద్రుడు, "వైనతేయుడు అనగా గరుక్మంతుడి" శక్తి పరాక్రమాలకు సంతోషించి ఈ విధంగా పలికాడు."నాయనా!!ఇది పవిత్రమైన అమృతభాండం. ఇది ఎట్టి పరిస్థితి లోనూ నీచులకు లభించరాదు".అని పలికి, కదృవ గరుక్మంతుని తల్లికి చేసిన మోసం గురించి కూడా తెలియచేసాడు ఇంద్రుడు.అప్పుడు గరుక్మంతుడు దాస్య విముక్తికై కదృవ అమృతం కోరిన సంగతి తెలిపి, ఇది నాకు కావలెనని అర్ధించాడు.ఇంద్రుడు సరేనని పలికి అమృతకలశాన్ని గరుక్మంతునికి జాగ్రత్తగా సమర్పించాడు.గరుక్మంతుడు అమృతకలశాన్ని తెచ్చి దర్భలు పరచి వాటి మీద పవిత్రమైన అమృతకలశాన్ని ఉంచాడు.పవిత్రమైన అమృతకలశం కదృవ పిల్లలకు అందిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

1 comment:

  1. చాలా బాగ వ్రాస్తున్నారు.
    గరుక్మంతుడు అని వ్రాస్తున్నారు. ఆ పదం తప్పేమో! గరుత్మంతుడు అనేది సరైన పదమై వుంటుందేమో అలోచించండి.

    ReplyDelete