Sunday, December 21, 2008

(2 వ భాగం) మాతృదేవో భవ – కదృవ మోసం

(2 వ భాగం) మాతృదేవో భవ – కదృవ మోసం


అక్కడి నుంచి వినత వెళ్ళగానే కదృవ దీపం సహాయంతో ఆ గుఱ్ఱాన్ని మొత్తం వెతికింది.ఎక్కడా ఒఖ్ఖ మచ్చ కూడా కనిపించలేదు.కదృవకు భయం వేసింది..తాను వేసిన పందెం గురించి..ఈ విషయం వినత కు తెలిస్తే తాను జీవితాంతం వినతకు దాస్యం చేయాలి..ఎలాగైనా తాను ఈ పందెం లో ఓడిపోలేదని వినతను నమ్మించాలి..ఎలాగ?? అని ఆలోచిస్తున్న కదృవకు మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆలోచన వచ్చిందే తడవు గా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి, తన పిల్లలైన నాగుల తో, తనకొచ్చిన కష్టం చెప్పుకొని ఎవరైనా ఎవరైనా వెళ్ళి గుఱ్ఱం తోక చివర చుట్టుకొని మచ్చలాగా కన్పించమని అడిగింది.కానీ ఆమె పిల్లలు అది ధర్మ విరుధ్ధమని, తాము అలా మోసం చేయలేమని తెగేసి చెప్పారు.అది విన్న కదృవ క్రోధంతో వారందరికీ శాపమివ్వబోతుండగా, ఆఖరి కుమారుడు వచ్చి "అమ్మా!! శాంతించు..నీ కోసం నేను ఈ పని చేస్తానని తల్లికి మాట ఇచ్చాడు.మరుసటి ఉదయం వినత, కదృవ గుఱ్ఱాన్ని పరీక్షించే సమయానికి కదృవ ఆఖరి కుమారుడు తన తల్లి చెప్పిన విధంగా తోకకు చుట్టుకొని కనిపించాడు. అది చూసిన కదృవ, వినతకు దూరం నుండి ఆ దృశ్యాన్ని చూపించి "చూడు చూడు..ఆ గుఱ్ఱానికి ఎంత పెద్ద మచ్చ ఉన్నదో!! కాబట్టి ఈ పందెం లో నేనే గెలిచాను.ఈ రోజు నుంచి నువ్వు నా దాసీవి అన్నది".పాపం ఇవేవీ తెలియని వినత తాను నిజంగానే పందెం లో ఓడిపోయానని, తొందరపడి పందెం కాసినందుకు విచారించి, ఆ రోజు నుంచి కదృవకు దాస్యం చేయ సాగింది.వినతకు ఈ దాస్యచెర నుంచి విముక్తి కలిగిందో లేదో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...






No comments:

Post a Comment