Sunday, November 30, 2008

6 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం

పసి పిల్లల ఆహారం~: 6 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం “మన అమ్మ” చిట్కా లో




ఒక 1/4 కేజి పాత బియ్యం,ఒక 2స్పూన్ల ఛాయ పెసరపప్పు, తీసుకొని బాండిలో కొంచెం వేడి చేసి, దించి మిక్సిలో రవ్వలాగా చేయాలి.దీన్ని ఒక బాటిల్ లో శుభ్రంగా నిల్వ చేసి, ప్రతిరోజూ ఒక 2,3 స్పూన్ల రవ్వను ఉప్పు చిటికెడు వేసి బాగా మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి.ఉడికాక తీసి స్పూన్ తో కలిపితే గుజ్జులా అవుతుంది.అప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి, శుభ్రం చేసిన వాము పొడి చిటికెడు కంటే తక్కువ గావేసి కలిపి పిల్లలకు తినిపిస్తూ, ఇంతకుముందు పొస్ట్ లో నేను చెప్పిన ఆకుకూరల సూప్ కూడా వారం లో 4 సార్లు ఖచ్చితంగా పెడుతూ, వాళ్ళ ఇష్టం గమనిస్తూ మధ్య మధ్య లో పప్పుకట్టు, చింతకాయ ఊరగాయ పలచగా కలిపి పెడుతూ ఉంటే పిల్లలూ ఇష్టం గా తింటారు..మీకు కూడా వాళ్ళు తింటున్న్రారన్న తృప్తి ఉంటుంది. సాయంత్రంపూట పసిపిల్లలకు ఇవ్వవలసిన ఆహారం ఏంటో తెలుసుకుందాము తదుపరి పొస్ట్ లో "మన అమ్మ" చిట్కాలో ...

పిల్లల మనో సౌందర్యానికి

పిల్లల సంరక్షణ - పిల్లల పెంపకం~:





పిల్లలకు సంభందించిన ఒక అధ్భుతమైన "మన అమ్మ"చిట్కాను ఈ పొస్ట్ లో చెప్పబోతున్నాను. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాటలు వినటంలేదనీ, బాగా చదవటం లేదనీ, ప్రతీ దానికీ ఎదిరించి మాట్లాడుతున్నారనీ, ఈ చిన్న వయసులోనే విసుగు, కోపం ఎక్కువయ్యాయని చాలా మధన పడుతూ ఉంటారు..!!కానీ ఇక మీద మీరు బాద పడాల్సిన అవసరం లేదు.ప్రాచీన కాలం నుండీ ఎంతో మహానుభావులైన మన ఆయుర్వేద మహాఋషులు మనకు ఎన్నో కానుకలు అందించారు.కానీ వీటిని మనం గమనించుకోకుండా మందుల షాపుల చుట్టూ తిరుగుతున్నాము. దీనికి కావలసిన పదార్ధాలు మనకు దొరికేవే..
మీ పిల్లలకు తులసీ మాలను వెండి లేదా రాగి తీగ తో గానీ చుట్టించి ప్రతీ రోజూ ధరింపచేయండి.తులసి చెట్టు ఎంత పవిత్రమైనదో మనకు తెలిసిందే.ప్రతీ నిత్యం మనము పూజిస్తాము. తులసి లేని ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కూడా నివసించదని మన పురాణాల్లొ చెప్పబడింది.దీన్నిబట్టి తులసి ప్రాముఖ్యత ఎంతో మనకు అర్ధమౌతుంది.దీనివల్ల పిల్లలకు మనసు ప్రశాంతం గా ఉండటమే కాక, చదువు మీద ఏకాగ్రతను,ఎవరి దగ్గర ఎలా మాట్లాడలో కూడా వారి బుద్దికి తెలిసే విధంగా చేస్తుంది.ఎదిరించి మాట్లాడే పిల్లలకు ఇది అద్భుతమైన కానుక.

పిల్లల ఆకలి పెరుగుదలకు~:

పిల్లల పెంపకం - పిల్లల సంరక్షణ పిల్లల ఆకలి పెరుగుదలకు~: 3 సంవత్సరాల పిల్లల నుంచి..

సాధారణంగా ఈ రోజుల్లో పిల్లలు వేళకు తినీ, తినక, అమ్మ అన్నీ చేసి పెట్టినా తినటానికి ఆకలి లేక, ఆకలి చచ్చిపోయి చిక్కిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలకు ఈ పొస్ట్ లో "మన అమ్మ" ఒక మంచి చిట్కాను అందిస్తోంది..తల్లులు కూడా తమ పిల్లలు తినటం లేదని బాధ పడకుండా ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి. సొంఠి మన అందరికీ తెలిసిందే..ఒక 100గ్రా తీసుకోని బాండీ లో కొంచెం 4,5 చుక్కలు నెయ్యి వేసి వేయించండి.తరువాత మిక్సి లో మెత్తగా పొడి చేయండి. దీన్ని నిలవ చేసుకొని ప్రతీ రోజూ మొదటి ముద్దలో అంటే.. ఒక నిమ్మకాయంత ముద్దలో ఒక చిటికెడు సొంఠిపొడి, కొంచెం నెయ్యి వేసి తినిపించండి. ఇలా చేయటం వల్ల జీర్ణ శక్తి మెరుగై, ఆకలి పెరిగి అన్నీ తింటారు. మీరు గుర్తుపెట్టులోవాల్సిన విషయం ఏంటంటే సొంఠిపొడి తింటున్నారు కదా.. అని ఇంకా ఎక్కువ వేస్తె బాగా వేడి చేసి మరొక సమస్య మొదలవుతుంది. కాబట్టి నేను చెప్పిన మోతాదులో దీన్ని ఉపయోగించుకొని మీరు, మీ పిల్లలు ఆనందంగా ఉంటారని ఆశిస్తూ తదుపరి పొస్ట్ లో జ్నాపక శక్తిని పెంచే మరొక అధ్భుతమైన అందమైన కానుక "మన అమ్మ" చిట్కాలో..

Tuesday, November 25, 2008

అసలు గర్భ నిర్ధారణ చేసుకోవటం ఎలా???

గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు~:అసలు గర్భ నిర్ధారణ చేసుకోవటం ఎలా???


కొంతమందికి గర్భదారణ జరిగినా కూడా ప్రతీనెలా ఋతుక్రమం (బహిష్టు) వస్తుంటుంది.దీనివలన వారు తమకు గర్భం వచ్చిందన్న సంగతి తెలుసుకోలేరు.మరి ఇలాంటి వారికి "మన అమ్మ" చిట్కా...!! ఇలాంటి లక్షణాలు కలిగిన అమ్మయిలకు కూడా, గర్భ ధారణ జరిగాక వేవిళ్ళు, వికారం, అతినిద్ర ఉంటాయి.అందువల్ల బహిష్టు వస్తున్నా కూడా ఈ లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా ఒక చిన్నపాటి పరీక్ష ద్వారా మనము తెలుసుకోవచ్చు. దగ్గరలోని ఒక లాబ్ లో యూరిన్ ప్రెగ్నెన్సి టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది..!! రిజల్ట్ పాజిటివ్ వస్తే మంచి గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి సూచనల మేరకు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ప్రతి నెలా బహిష్టు కనిపిస్తిన్న వారికి ఏం చేయాలో ఇంతకు ముందు పొస్ట్ లో నేను చెప్పిన చిట్కా పాటించండి..

వేవిళ్ళకు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు

గర్బ్భిణి స్త్రీలకు~: వేవిళ్ళకు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు

నెల తప్పిన దగ్గర నుంచి గర్భవతికి మగతగా, నీరసంగా, కడుపులో తిప్పుతూ, ఉండి ఏమి తిన్నా ఇమడదు.తినటానికి ఏదీ హితవుగా అనిపించదు.నోరంతా అరుచిగా ఉంటుంది.కొంతమంది ఆడపిల్లలు ఇవన్నీ తెలియక తమకు ఏమైందోనని కంగారు పడుతూ ఉంటారు.కానీ కంగారు పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఇవన్నీ తల్లి కాబోతున్నారు అనటానికి సూచనలు..! మరి ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో "మన అమ్మ" చిట్కా ద్వారా అమ్మయిలూ.. మీరంతా తెలుసుకోవాలి..!ఉదయాన్నే పరకడుపున, అంటే యేమీ తినకుండా కొంచెం అల్లం దంచి, 1గ్లాసు నీళ్ళలో వేసి, 1స్పూను దనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి స్టవ్ మీద మరిగించి, ఈ కషాయాన్ని ఉదయం ఒక సారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే వేవిళ్ళు కొంత తగ్గి అన్నం హితవుగా ఉంటుంది. ఈ సమయంలో నిమ్మఊరగాయ పచ్చడి తప్ప మిగతావి తినకూడదు.మిగతా ఆహారం మామూలుగా తినవచ్చు.ఇంతకు ముందు నేను చెప్పిన కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. అసలు గర్భ నిర్ధారణ ఎలా చేసుకోవాలో.. గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము "మన అమ్మ" చిట్కాలో తదుపరి పోస్ట్ లో....

Monday, November 24, 2008

కేశ సౌందర్య కానుక తెల్ల జుట్టు రాకుండా.. ఉండేదుకు

సౌందర్య కానుక~: కేశ సౌందర్యం కోసం


కలబంద నూనె తయారీ విధానాన్ని "మన అమ్మ" చిట్కాలో ఈ పొస్ట్ లో తెలుసుకుందాము.దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు- 1/4కేజి 2.కొబ్బరి నూనె-1/4 కేజి 3.మరుమం ఆకులు(వీటిని పూలల్లొ సువాసన కోసం కడతారు పూలు అమ్మే చోట దొరుకుతాయి). తయారీ విధానం~: ఒక బాండీ లో కొబ్బరి నూనె పోసి, కలబంద గుజ్జు కూడా పోసి, స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టి, మాడకుండా కలయబెడుతూ ఉండండి. కలబంద గుజ్జు లోని సారమంతా నూనెలోకి ఇంకేవరకు, నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి దించేయండి.చివర్లో మరుమం ఆకులు వేయండి.వేడి చల్లరాక ఒక సీసాలో భద్రపరుచుకోండి.ఇంతే ...దీన్ని ప్రతీ ఒక్కరూ వాడవచ్చు.శరీరం లోని అతి వేడి ని కూడా తగ్గించి మెదడును ప్రశాంతంగా చేస్తుంది.ఐతే దీన్ని వాడే విధానం కూడా మీరు తెలుసుకోవాలి.రాత్రిపూట గోరువెచ్చగా చేసి, మునివేళ్ళతో మృదువు గా మర్దనా చేయండి.ఉదయాన్నేచక్కగా కుంకుడుకాయల తో తల స్నానం చేయండి.తల స్నానం చేసిన ప్రతీ సారీ మీ దిండు కవరు ను మార్చటం, అలాగే మీ దువ్వెనను శుభ్రం చేసుకోవటం మరచిపోవద్దు...!!( ఒక వేళ ఇలా చేయకపోతే మళ్ళి వాటిల్లోని మట్టి, చుండ్రు అంతా తిరిగి మీ జుట్టు లోకి వచ్చి సమస్యను అధికం చేస్తుంది. )ఇలా వారానికి 2 సార్లు తప్పని సరిగా చేయటం ద్వారా ఎప్పటికి తెల్ల వెంట్రుకలు రావు..చుండ్రు పూర్తిగా పోతుంది. జుట్టు రాలటం తగ్గుతుంది.మరి "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను ఆచరించి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను

కేశ సౌందర్య కానుక కలబంద నూనె ఉపయోగాలు

సౌందర్య కానుక~: కేశ సౌందర్యం కోసం


కలబంద నూనె ..!!ఇది చాలా అద్భుతమైన కానుక!దీనివల్ల జుట్టు రాలటం, వెంట్రుకలు తెల్లబడటం, ఎఱ్ఱబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు.మరి ఇంత అద్భుతమైన ఈ నూనెను ఎలా తయారు చేయాలో "మన అమ్మ" చిట్కాలో దీని తయారీ విధానాన్ని తెలుసుకుందాము...తదుపరి పొస్ట్ లో.....!!

ముఖ సౌందర్య కానుక

సౌందర్య కానుక~: ముఖ సౌందర్యం కోసం


ముఖం మీద నల్లని, ఎఱ్ఱని, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు వచ్చాయని బాధపడే వారి కోసం "మన అమ్మ" అద్భుతమైన సౌందర్య చిట్కా..!!దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు 2.పసుపు-1/4 చెంచా 3.మెంతి పొడి-1/2 చెంచా 4.జాపత్రి-1/2 చెంచా (జాపత్రి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.) 5.ఉసిరి పొడి-1/2 చెంచా.తయారీ విధానం~: కలబంద గుజ్జు మీ ముఖానికి సరిపడా తీసుకుని అందులో ఈ 4 పొడులను కలిపి బాగా నూరండి.ముఖం మీద, మెడ మీడ మీద ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక గంట సేపు పట్టించండి.ఇది స్త్రీ,పురుషులు ఇద్దరూ వాడవచ్చు.దీన్ని ప్రతీ రోజూ వాడటంవల్ల ముఖము అతి ప్రకాశవంతముగా మారుతుంది...!! "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను అందరూ వాడి అందాన్ని పొందుతారని ఆశిస్తూ..జుట్టు రాలకుండా ఉండేదుకు, తెల్లజుట్టు రాకుండా ఉండేదుకు కలబంద నూనే "మన అమ్మ" చిట్కాలో తదుపరి పొస్ట్ లో.......

కేశ సౌందర్య కానుక జుట్టు రాలకుండా ఉండేదుకు..

సౌందర్య కానుక~: కేశ సౌదర్యం కోసం


ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలటం.కాని దీన్ని ఎలా అరికట్టాలో తెలియక తికమక పడుతూ ఉన్నట్టున్నారు..అలాంటి వారి కోసమే ఈ చిట్కా..!!ఒక కోడిగుడ్డు ను తీసుకోండి.తలస్నానం చేసే ఒక గంట ముందు ఎగ్గ్ లోని మిశ్రమం అంతా జుట్టు కుదుళ్ళకు బాగా అంటే విధంగా పట్టించండి.తరువాత ఎప్పటిలాగే మీ తలకు సరిపడిన ఒక మంచి హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయండి.ఇలా వారానికి 2 సార్లు చేయండి.దీనితోపాటు ఆహారంలో కొన్ని మార్పులూ అవసరం..వారంలో 3 సార్లు ఖచ్చితంగా ఆకుకూరలు, రోజూ ఒక తాజా పండు, పెరుగు, పాలు తప్పనిసరి.అంతే కాక.. అతిగా ఆలోచించటం,వేళకు భోజనం చేయకపోవటం వంటివి మానుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం,వేళకు నిద్ర పోవటం వంటివి చేయాలి. మెరుగైన ఫలితాల కోసం నేను చెప్పిన ఆయిల్ మసాజ్ కూడా చేసి తరువాత ఈ చిట్కాను ఉపయోగించి చూడండి...ముఖం మీద మచ్చలు పోవటానికి మరొక అడ్భుతమైన కానుక "మన అమ్మ" చిట్కాలో తదుపరి పొస్ట్ లో.....

కేశ సౌందర్య కానుక మీ జుట్టు మెరుపు కోసం

సౌందర్య కానుక~: కేశ సౌందర్య కానుక మీ జుట్టు మెరుపు కోసం

మీ జుట్టు తలంటి పోసుకున్నా కూడా నిర్జీవం గా ఉందా??ఐతే మీ జుట్టు మెరుపు కు "మన అమ్మ" చిట్కా!!దీనివల్ల మీజుట్టుకు మెరుపు మాత్రమే కాక, మృదువు గా అవుతుంది..!! మామూలుగా మీ తలంటి అయ్యాక , చివర్లో ఒక నిమ్మచెక్క ను తీసుకొని ఒక మగ్గు గోరు వెచ్చని నీళ్ళలో పిండి, ఆ నీళ్ళను తలమీద పోసుకోండి.తరువాత మరొక మగ్గు మామూలు నీళ్ళను పోసుకోండి.ఇంతే మీరు చేయాల్సింది...ఎంత సులువో చూశారా!!ఇంకా మరిన్ని మెరుగైన ఫలితాలకై ఇంతకు ముందు నేను చెప్పిన ఆయిల్ మసాజ్ కూడా చేసి, తరువాత ఈ "మన అమ్మ" చిట్కా ను చేసి చూడండి. జుట్టు ఊడకుండా ఉండేదుకు ఒక కానుక "మన అమ్మ" చిట్కా ..తదుపరి పొస్ట్ లో.....

జుట్టు పెరగటానికి, చుండ్రు తగ్గటానికి...!!

కేశ సౌందర్య కానుక: జుట్టు పెరగటానికి, చుండ్రు తగ్గటానికి...!!

చాలా మందిని బాధ పెడుతున్న సమస్య చుండ్రు(డాండ్రఫ్).దీనివల్ల జుట్టు పెరగక పోగా, ఇంకా ఎక్కువ గా ఊడుతుంది.చలికాలం లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.మరి దీనికి ఏం చేయాలో తోచక దిగులు పడుతున్నారా??దీనికోసమే "మన అమ్మ " చిట్కా!!ఇవి మీకు అందుబాటులో ఉండేవే..దీనికి కావలసిన పదార్దాలు~: వేపాకులు.మీరు తలంటి పోసుకునే రోజు కొన్ని వేపాకులు తీసుకొని ఒక గిన్నెడు నీళ్ళలో ఉడకబెట్టండి.బాగా మరిగితే నీళ్ళ రంగు మారుతుంది.మామూలుగా మీరు ఎప్పుడూ చేసే విధంగా తలంటి చేసి, చివరగా మరిగిన వేపాకు నీళ్ళు కొద్దిగ చల్లరాక తల మీద పోసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేయండి.దీనివల్ల మీ చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టు పెరగుతుంది కూడా!!ఇంతకు ముందు నేను చెప్పిన ఆయిల్ మసాజ్ కూడా చేస్తూ తరువాత ఈ పధ్దతి పాటించి మీ కురులను ఆరోగ్యంగా ఉంచుకుంటారని ఆశిస్తూ జుట్టు మెరుపు కు మంచి కేశ సౌందర్య కానుక తదుపరి పొస్ట్ లో "మన అమ్మ" చిట్కా లో ...

Tuesday, November 18, 2008

అందమైన పట్టు లాంటి జుట్టు కోసం~:

చాలా మంది అందంగా ఉన్నా, జుట్టు మాత్రం గడ్డి లాగా ఉంటుంది.దీనితో వారు సహజం గా అందం గా ఉన్నా జుట్టుకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియక దిగులు పడుతూ ఉంటారు.కొంచెం సమయమం కేటాయిస్తే అందమైన, పట్టు కుచ్చు లాంటి జుట్టు మీ సొంతం..!! అది ఎలా అంటే..తలంటి పోసుకునే ముందు రోజు రాత్రి ఆలివ్ ఆయిల్, ఆముదం, కొబ్బరినూనె ఈ మూడు సమభాగాలుగా తీసుకుని కొంచెం గోరు వెచ్చగా చేసి 5నుండి10 నిమిషాలు మునివేళ్ళతో మృదువు గా మసాజ్ చేయండి.తరువాత రోజు పొద్దున వీలైతే కుంకుడుకాయల తో కాని, మీ తలకి సరిపడిన మంచి మైల్డ్ అంటే ఎక్కువ కెమికల్స్ లేని షామ్పూ తో శుభ్ర పరుచుకోండి.ఇలా వారానికి 2 సార్లు చేయటం ద్వారా నెల తిరిగే సరికి మీ జుట్టు లోని మార్పు ను మీరే గమనిస్తారు.!!మీ జుట్టు కు మంచి మెరుపు రావటము కోసం ఏం చేయాలో తదుపరి పొస్ట్ లో....మన అమ్మ చిట్కా

పిల్లల ఆకలి పెరుగుదలకు – పసి పిల్లల ఆహార కానుక మన "అమ్మ చిట్కా!!


ఏంటి??మీ పిల్లలకు ఆకలి తగ్గిందా?ఏది తినిపిద్దామని చూసినా మొహం తిప్పేస్తున్నారా?ఐతే మీకోసమే మన "అమ్మ" చిట్కా!! వస కొమ్ము (కిరాణా, పచారీ షాపుల్లో దొరుకుతుంది). దీన్ని బాగా కడిగి, ఒక సాన మీద అరగదీసి (శనగగింజ అంత పరిమాణం)ఒక స్పూన్ లోకి తీసుకుని కొంచెం పాలు ఉగ్గు గిన్నె లోకి తీసుకొని, అరగదీసిన వసకొమ్ము రసాన్ని పాలలో కలిపి ఉగ్గు గిన్నె తో పసి పిల్లల నోట్లోకి పొయాలి.ఇది 3వ నెల వచ్చాక నెలా, 2నెలలకు ఇవ్వవచ్చు.మోషన్ వాసన(అజీర్తి)వస్తూ ఉన్నా, పైన చెప్పిన విధంగా చేసి చూడండి..తేడా మీకే తెలుస్తుంది.

అందమైన మోము కోసము

ముఖము మంచి ఛాయ రావటానికి ఒక అందమైన "మన అమ్మ" చెప్పే చిట్కా!!ఇది కేవలము ముఖానికి మాత్రమే కాక, వంటికి కూడా ఉపయోగించండి. దీనికి కావలసిన పదార్ధాలు~:శనగ పిండి, నువ్వుల నూనె (మేలు రకం).కావలిసినంత శనగ పిండి తీసుకుని అండులో ముద్దకు వచ్చేటట్లు నువ్వుల నూనె కలిపి ప్రతీ రోజూ స్నానం చేసేటప్పుడు ఉపయోగించండి. తరువాత ఒక హెర్బల్ సబ్బు ని ఉపయోగించండి.ఇలా చేయటము వల్ల ఒక 40 రోజుల్లోనే తేడా చూస్టారు

పసి పిల్లల ఆహార కానుక -మన "అమ్మ చిట్కా!!

3 నుంచి 5 నెలలవరకూపుట్టిన తరువాత సామాన్యంగా మూడు నెలల వరకు పసి బిడ్డకు పాలు సరిపోతాయి.తరువాత బిడ్డ ఎదుగుదలకు సిరిలాక్ యాపిల్ ఫ్లేవర్ మార్కెట్ లో దొరుకుతుంది..ఇది ఉదయం, సాయంత్రం ఇస్తూ తల్లిపాలు కూడా ఇవ్వాలి. ఎదైనా ఒక ఆకుకూర,క్యారట్,ఆలు వంటి ఆహారం కూడా ఇవ్వవచ్చు.ఎలాగంటే ..ఆకుకూర ఐతే 2,3 ఆకులు ఉప్పు వేసి ఉడికించి, ఉడికిన నీళ్ళు మాత్రమే తీసుకుని కొద్దిగ జారుడు గా చేసి పెట్టాలి. అదే క్యారట్,ఆలు ఐతే వీటిలో ఎదొ ఒక్కటి మాత్రమే తీసుకుని ఒక పావు ముక్క చొప్పున ఉప్పు వేసి ఉడికించి, గుజ్జు గా (పీచులు లేకుండా చేసి) తినిపించాలి.ఇది గట్టిగా ఉండకుండా మింగుడు పడటానికి వీలుగా ఊండేలా చూసుకుని పెట్టాలి.ఇలా రోజూ కొద్ద్ద్గా అలవాటు చేస్తూ ఉంటే మీ పిల్లలు బొద్దుగా,ముద్దుగా తయారవుతారు.కాని గుర్తుపెట్టుకోవలసిన విషయం అన్ని ఒకే సారి ఇవ్వకూడదు. పసిపిల్లల జీర్ణాశయానికి ఒక్కోటి .. అలవాటు చేయాలి.. మీ పిల్లల ఆకలి పెరగటాన్కి మంచి మన “అమ్మ” చిట్కా తదుపరి పొస్ట్ లో….!!

Sunday, November 16, 2008

దీపకుని కథ

కాశీ నగరము లోఅందరు దేవతలు నివాసమై ఉన్నారు.శ్రీ మహవిష్ణువు దీపకుని గురుభక్తికి ముగ్ధుడై దీపకుని వద్దకు వెళ్ళి "నాయనా!!నీ గురుభక్తికి మెచ్చాను.ఏమి వరం కావాలో కోరుకో!"అని పలికాడు శ్రీ మహావిష్ణువు.అప్పుడు దీపకుడు నమస్కరించి "స్వామి!మీ కోసంఎంత మంది తపస్సు చేసినా ప్రత్యక్శం కారు.మీ గురించి నేను ఏనాడూ తలచుకోలేదు..మరి నావద్దకు ఎందుకు వచ్చారు" అని అడిగాడు.అప్పుడు శ్రీ మహవిష్ణువు "నాయనా!గురువు ను సేవిస్తే మమ్ములను సేవించినట్లే" అని పలికి వరం కోరుకోమన్నాడు.అప్పుడు దీపకుడు "స్వామీ!నాకు ఏ వరాలూ వద్దు..అంతగా ఐతే మా గురువు గారి వ్యాధి తగ్గించమంటారేమో కనుక్కోని వస్తాను"అని వెళ్ళాడు.అప్పుడు గురువు "ఏమిరా!నాకు సేవ చేయటము కష్టమై వరంకోరుతున్నావా!నా పాపం నేనే అనుభవిస్తాను".అనగా దీపకుడు ఆ విషయం శ్రీమహవిష్ణువుకు చెప్పగా శ్రీహరి నిర్వాణ మండపం లో దేవతల సమక్శంలో కాశీ విశ్వనాధునికి ఈ విషయం చెప్పగా కాశీ విశ్వనాధుడు సంతోషించి శ్రీహరి తో కలిసి దీపకుని వద్దకు వచ్చి వరం కోరుకోమని పట్టుబట్టారు.వరం తప్పనిసరి ఐతే నా గురు భక్తి నిశ్చలం అయ్యేటట్లు,గురు కృప సదా నాకు కలిగేటట్లు దీవించమని పలికాడు.వారు తథాస్తు!అని సద్గురువు కు తాము ప్రతిరూపమని పలికి అంతర్దానమైనారు.వేదధర్మునికి వ్యాధి మాయమైంది.ఆయనకు ఆ వ్యాధి అనేది శిష్యులకు పెట్టిన పరీక్శ.ఈ పరీక్శలో దీపకుడు నెగ్గి గురువు వాత్సల్యాన్ని,అభయాన్ని పొంది అత్యంత శ్రేష్టుడైనాడు.

ఈ కలియుగంలో గురుభక్తి తో కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటాను తదుపరి పొస్ట్ లో...

Saturday, November 15, 2008

దీపకుని కథ

ఇప్పటి వరకు మనము గురువు పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని తెలుసుకున్నాము కదా!!ఇప్పుడు మీకు ఒక సందేహం ..ఇవన్ని వినటానికి ,చదవటానికి మాత్రమేనా??మాకు గురువు పట్ల అంత భక్తి కలగాలంటే ఏమన్నా నిదర్శనాలు ఉన్నాయా?అని మీరు అడగవచ్చు.నిరభ్యంతరంగా మీకు కలిగే ఈ ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు మన పురాణాలలో ఉన్నాయి.అవి నేను కొన్ని చెప్పబోతున్నాను.అంతేకాక ఈ కలికాలంలో కూడా గురువును నమ్మి నేను పొందిన ,నాకు కలిగిన అనుభవాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.మరి సిధ్ధంగా ఉన్నారా??!! ఆధ్యాత్మికంసద్గురువు ను గురించి చెప్పటము ఎవరితరము కాదు. ఐనా ఆయన దయతో కలిగించిన ఈ అవకాశము ద్వారా నాకు లభించిన చిరు ఙ్నానం తో కొన్ని దివ్య కథలు తెలుసుకుందాం.పూర్వకాలంలో వేద ధర్ముడు అని ఒక గురువు గారి దగ్గర ఎంతో మంది శిష్యులు ఎంతో మంది శిష్యులు ఉండేవారు. వారిలో దీపకుడు ఎంతో శ్రద్ద తో గురువు గారి పట్ల వినయము తో ఉండేవాడు..ఒక రోజు గురువు గారు శిష్యుల భక్తి శ్రద్దలకు ఒక పరీక్ష పెట్టాలని ఈ విధంగా చెప్పారు.నాయనలారా!!పూర్వ జన్మ పాపం వల్ల నాకు ఇప్పుడు కుష్టు వ్యాధి కలగబోతున్నది.అందుచేత నేను సర్వపాపహరమైన కాశి లో ఉండి ఆ వ్యాదిని అనుభవించి నా పాపఫలాన్ని ఈ జన్మలోనే తొలగించుకుంటాను.మీలో ఎవరైనా నాకు ఆ సమయంలో సేవ చేయగలరాఅని ప్రశ్నించారు.శిష్యులంతా గురుసేవ లో యేమి లోపం కలుగుతుందో అని భయపడి వెనక్కు తగ్గారు.దీపకుడు మాత్రము గురువర్యా నేను తమరి సేవ చేసుకుంటాను.మీరు అనుమతి ఇస్తే ఆ పాపము నేను అనుభవిస్తాను అన్నాడు.గురువు గారు సంతోషించి నాయనా ఎవరి పాపము వారే అనుభవించాలి కాని, ఆ సమయము లో నేనెలా ఉంటానో నాకే తెలియదు అని చెప్పటము తో దీపకుడు గురువుగారికి నమస్కరించి గురు సేవకు పూనుకున్నాడు.తరువాత యేమి జరిగిందో తదుపరి పొస్ట్ లో తెలుసుకుందాము..




సద్గురువు ను ఎలా తెలుసుకోవాలి?

ఓం శ్రీ సాయి నాధాయ నమః

సద్గురువు ను ఎలా తెలుసుకోవాలి??ఇప్పుడు మనకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి కదా!!మాకు దైవ భక్తి ఉంది.మేమంతా రొజూ మా ఇష్ట దైవాలకు పూజలు చేసుకుంటున్నాము..ఇంకా గురువు,సద్గురువు అంటూ అవసరమా??అని కొన్ని సందేహాలు కలుగుతాయి.కాని ఇక్కడే మనము కొంచెం వివేకము తో ప్రవర్తించాల్సిన అవసరము ఉంది. భగవానుడు ఐన శ్రీక్రృష్ణ భగవద్గీత లో ఇలా చెప్పారు."నన్ను గురించి ఆలోచించేవారు కొందరు.కోటికి కొంతమంది నన్ను పొందాలని ప్రయత్నించినా వారు నన్ను పొందలేరు.నా తత్వాన్ని అర్దం చేసుకోలేరు.అందుకనే దేవతలు,అంటూ చాలామందికి పూజలు చేస్తూ ఉంటారు".అని చెప్పారు.మరలా శ్రీక్రృష్ణ భగవానుడే అందరిలో నన్ను చూడగలిగేవారు అన్ని జీవులలో ,పండితులలో నన్ను దర్సించేవారు ,జ్ఞానులు అని చెప్పి ,అటువంటి సడ్గురువులకు తనకు బేధం లేదనీ చెప్పియున్నారు.అందుకోసమే తాను స్వయం గా భగవంతుడైనా కూడా తనను అందరూ అనుసరించుటకు గాను సందీపని మహర్షి వద్ద ఎంతో వినయము తో శిష్యుని గా మసలుకొని లోకానికి గురుశిష్య సంబంధం గురించి తెలియ పరిచారు.గురువు పట్ల శిష్యుడు ఎంత వినయ విధేయలతో మెలగి ఙ్నానం గ్రహించాలో శ్రీరామ ,శ్రీక్రృష్ణ అవతారాల లో బోధించారు.

Friday, November 14, 2008

గర్భిణి స్త్రీలకు సూచనలు - జాగ్రతలు

గర్భిణీ స్త్రి ఆరోగ్య కానుక~:

అమ్మ అనిపించుకోటము కూడా ప్రతీ స్త్రీ కి ఒక వరము. మరి అంతటి అదృష్టాన్ని ,సంఘంలో మన గౌరవ మర్యాదలను నిలిపే అలాంటి గర్భమును ధరించాక ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలో తెలియక గర్భస్రావాలు జరుగుతున్నాయి.మాత్రుత్వంలొని ఆనందాన్ని అనుభవించనీయకుండా పెనుభూతం లాంటి ఈ గర్భస్రావాన్ని ఎలా తప్పించుకోవాలో "మన అమ్మ" చెప్పే చిట్కా లో చూద్దాం!! పుదీనా ఆకు అందరికి అందుబాటులో ఉంటుంది.ఈ ఆకులను నలిపి గర్భంధరించిన 1 నుండి 3 లేక 5 నెలల వరకు దీని వాసన పీలుస్తూ ఉంటే రక్త స్రావం ఆగిపోయి గర్భం నిలబడుతుంది.అలాగే దీనితో పాటు చిన్న చిన్న జాగ్రత్తలూ అవసరం.అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి ఈ లేత నెలల్లొ తీసుకోకూడదు.

Wednesday, November 12, 2008

సౌందర్య కానుక -అందమైన మోము కొసము

అందమైన మోము కొసము~:
చాలా మంది నల్లగా ఉన్నామని బాధ పడుతూ ఉంటారు.అలాంటి వారి కోసమే ఈ "మన అమ్మ " చిట్కా!!దీనికి బ్యూటి పార్లర్ల చుట్టూ తిరిగి ఇప్పటికే చాలా సమయము ను , డబ్బు ను ఖర్చు చేసి ఉంటారు.కాని ఈ చిట్కా తో మీరు పడే శ్రమ కేవలము "మన అమ్మ " చిట్కా ను చదివి పాటించటము మాత్రమే.దీనికి కావలసిన పదార్దాలు~:1.పచ్చి పసుపు కొమ్ములు 2.నల్ల నువ్వులు(మంచి రకము)పచ్చి పసుపు కొమ్ములను శుభ్రము గా కడిగి,దంచి పొడి చేసుకొవాలి.అలాగే నల్ల నువ్వులను కూడా దంచి పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసా లో భద్ర పరుచుకోవాలి.ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా పట్టించటము వల్ల పసుపు లోని పచ్చదనము అంతా ముఖము లోకి వస్తుంది.అంతకు ముందు మిమ్మల్ని చూసిన వారు ఈ చిట్కాను వాడిన తరువాత మీలో వచ్చే మార్పు ను చూసి ఆశ్చర్యపోవటము ఖాయం.పసుపు దాదాపు అన్ని చర్మ తత్వాలకు సరిపోతుంది.ఎక్కడో అరుదు గా మాకు పడదు అనుకున్నవారు ముందు మోచేతి మీద ప్రయత్నించి చూడండి.

Tuesday, November 11, 2008

ముఖ సౌందర్య కానుక~:

కానుక~:ముఖము మీద నల్ల మచ్చలు వున్నాయని బాధ పడె వారి కొసముపుదీన ఆకులను ముద్ద చేసి ముఖమునకు ఒక 40 రోజులు పట్టిన్చటము వల్ల ముఖముకు మంచి చాయ రావటమె కాకుండ మచ్చలు కూడా పోతాయి

Saturday, November 8, 2008

సద్గురువుని ఎలా తెలుసుకోవాలి?

మనకి మనమే వెతికితే మన అంచనా మన లాగా లోపభుఇష్టంగా వుంటుంది. ఆత్మ జ్ఞానానికి కృషిచేసేవాడు వేయి మంది లో ఒక్కడే వుంటారని శ్రీ కృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీతలో చెప్పారు. ఆ రోజుల్లోనే జ్ఞానులు అంత అరుదు ఐతే, ఈరోజుల్లో వీదికొకరు తాము భగవంతుని అవతారము అని చెప్పుకుంటున్నారు. మరి నిజమైన సద్గురువును లేక జ్ఞాని అంటే ఎవరు? వారిని మనం ఎలా తెలుసుకోగలం?
వెలుగు తానూ వెలుగు అని చాటుకోదు. నిజమైన సద్గురువు తాను గురువుని అని చాటుకోరు. సద్గురువు ప్రతీ జీవిని తన ప్రతిరూపముగా భావిస్తారు. బాహ్యఆడంబరాలకు తావివ్వకుండా నిజమైన ప్రేమను విశ్వాసాన్ని అర్పించిన వారికీ ఆభయమును ఇచ్చి, సర్వ వేళల యందును కాపాడి సకల కోరికలను నెరవేర్చువారే సద్గురువు.

Friday, November 7, 2008

శ్రీ గురుభ్యోనమః

" అభిష్ట కామప్రద కల్పవృక్షం
అనేక జన్మార్జిత పుణ్య లభ్యం
అశేష పాపానల భూరి వర్షం
నమామి నిత్యం సద్గురు సాయి పాదరేనుం "


ముందుగా మనము గురువు ని స్మరించుకుందాం. గురువు అనగా అజ్ఞానము అనే చీకటి ని పారద్రోలి జ్ఞాన జ్యోతి ని ప్రజ్వలింప చేయువాడె సద్గురువు. గురువు అని ఏ వస్తువుని నమ్మి సీవించినా, తీరని కోరికలు వుండవు. గురువుని పూజించిన వారికీ త్రిమూర్తులు కూడా వశులవుతారు. వారికీ ఇహ పరములో ఎటువంటి బాధలు కలగవు. నాలుగు పురుషార్ధాలు లభిస్తాయి. ఎటువంటి శాస్త్రముల తో పనిలేదు. కేవలము హృదయమును అర్పించి నిష్కల్మషముగా నమ్మి శ్రీ చరణములు శరణు వేడటమే. 
నెక్స్ట్ పోస్ట్ లో అలాంటి సద్గురువు ను ఎలా తెలుసుకోవాలో చెప్పుకుందాం.