Sunday, November 16, 2008

దీపకుని కథ

కాశీ నగరము లోఅందరు దేవతలు నివాసమై ఉన్నారు.శ్రీ మహవిష్ణువు దీపకుని గురుభక్తికి ముగ్ధుడై దీపకుని వద్దకు వెళ్ళి "నాయనా!!నీ గురుభక్తికి మెచ్చాను.ఏమి వరం కావాలో కోరుకో!"అని పలికాడు శ్రీ మహావిష్ణువు.అప్పుడు దీపకుడు నమస్కరించి "స్వామి!మీ కోసంఎంత మంది తపస్సు చేసినా ప్రత్యక్శం కారు.మీ గురించి నేను ఏనాడూ తలచుకోలేదు..మరి నావద్దకు ఎందుకు వచ్చారు" అని అడిగాడు.అప్పుడు శ్రీ మహవిష్ణువు "నాయనా!గురువు ను సేవిస్తే మమ్ములను సేవించినట్లే" అని పలికి వరం కోరుకోమన్నాడు.అప్పుడు దీపకుడు "స్వామీ!నాకు ఏ వరాలూ వద్దు..అంతగా ఐతే మా గురువు గారి వ్యాధి తగ్గించమంటారేమో కనుక్కోని వస్తాను"అని వెళ్ళాడు.అప్పుడు గురువు "ఏమిరా!నాకు సేవ చేయటము కష్టమై వరంకోరుతున్నావా!నా పాపం నేనే అనుభవిస్తాను".అనగా దీపకుడు ఆ విషయం శ్రీమహవిష్ణువుకు చెప్పగా శ్రీహరి నిర్వాణ మండపం లో దేవతల సమక్శంలో కాశీ విశ్వనాధునికి ఈ విషయం చెప్పగా కాశీ విశ్వనాధుడు సంతోషించి శ్రీహరి తో కలిసి దీపకుని వద్దకు వచ్చి వరం కోరుకోమని పట్టుబట్టారు.వరం తప్పనిసరి ఐతే నా గురు భక్తి నిశ్చలం అయ్యేటట్లు,గురు కృప సదా నాకు కలిగేటట్లు దీవించమని పలికాడు.వారు తథాస్తు!అని సద్గురువు కు తాము ప్రతిరూపమని పలికి అంతర్దానమైనారు.వేదధర్మునికి వ్యాధి మాయమైంది.ఆయనకు ఆ వ్యాధి అనేది శిష్యులకు పెట్టిన పరీక్శ.ఈ పరీక్శలో దీపకుడు నెగ్గి గురువు వాత్సల్యాన్ని,అభయాన్ని పొంది అత్యంత శ్రేష్టుడైనాడు.

ఈ కలియుగంలో గురుభక్తి తో కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటాను తదుపరి పొస్ట్ లో...

No comments:

Post a Comment