Sunday, November 30, 2008

పిల్లల మనో సౌందర్యానికి

పిల్లల సంరక్షణ - పిల్లల పెంపకం~:





పిల్లలకు సంభందించిన ఒక అధ్భుతమైన "మన అమ్మ"చిట్కాను ఈ పొస్ట్ లో చెప్పబోతున్నాను. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాటలు వినటంలేదనీ, బాగా చదవటం లేదనీ, ప్రతీ దానికీ ఎదిరించి మాట్లాడుతున్నారనీ, ఈ చిన్న వయసులోనే విసుగు, కోపం ఎక్కువయ్యాయని చాలా మధన పడుతూ ఉంటారు..!!కానీ ఇక మీద మీరు బాద పడాల్సిన అవసరం లేదు.ప్రాచీన కాలం నుండీ ఎంతో మహానుభావులైన మన ఆయుర్వేద మహాఋషులు మనకు ఎన్నో కానుకలు అందించారు.కానీ వీటిని మనం గమనించుకోకుండా మందుల షాపుల చుట్టూ తిరుగుతున్నాము. దీనికి కావలసిన పదార్ధాలు మనకు దొరికేవే..
మీ పిల్లలకు తులసీ మాలను వెండి లేదా రాగి తీగ తో గానీ చుట్టించి ప్రతీ రోజూ ధరింపచేయండి.తులసి చెట్టు ఎంత పవిత్రమైనదో మనకు తెలిసిందే.ప్రతీ నిత్యం మనము పూజిస్తాము. తులసి లేని ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కూడా నివసించదని మన పురాణాల్లొ చెప్పబడింది.దీన్నిబట్టి తులసి ప్రాముఖ్యత ఎంతో మనకు అర్ధమౌతుంది.దీనివల్ల పిల్లలకు మనసు ప్రశాంతం గా ఉండటమే కాక, చదువు మీద ఏకాగ్రతను,ఎవరి దగ్గర ఎలా మాట్లాడలో కూడా వారి బుద్దికి తెలిసే విధంగా చేస్తుంది.ఎదిరించి మాట్లాడే పిల్లలకు ఇది అద్భుతమైన కానుక.

No comments:

Post a Comment