Monday, November 24, 2008

కేశ సౌందర్య కానుక తెల్ల జుట్టు రాకుండా.. ఉండేదుకు

సౌందర్య కానుక~: కేశ సౌందర్యం కోసం


కలబంద నూనె తయారీ విధానాన్ని "మన అమ్మ" చిట్కాలో ఈ పొస్ట్ లో తెలుసుకుందాము.దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు- 1/4కేజి 2.కొబ్బరి నూనె-1/4 కేజి 3.మరుమం ఆకులు(వీటిని పూలల్లొ సువాసన కోసం కడతారు పూలు అమ్మే చోట దొరుకుతాయి). తయారీ విధానం~: ఒక బాండీ లో కొబ్బరి నూనె పోసి, కలబంద గుజ్జు కూడా పోసి, స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టి, మాడకుండా కలయబెడుతూ ఉండండి. కలబంద గుజ్జు లోని సారమంతా నూనెలోకి ఇంకేవరకు, నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి దించేయండి.చివర్లో మరుమం ఆకులు వేయండి.వేడి చల్లరాక ఒక సీసాలో భద్రపరుచుకోండి.ఇంతే ...దీన్ని ప్రతీ ఒక్కరూ వాడవచ్చు.శరీరం లోని అతి వేడి ని కూడా తగ్గించి మెదడును ప్రశాంతంగా చేస్తుంది.ఐతే దీన్ని వాడే విధానం కూడా మీరు తెలుసుకోవాలి.రాత్రిపూట గోరువెచ్చగా చేసి, మునివేళ్ళతో మృదువు గా మర్దనా చేయండి.ఉదయాన్నేచక్కగా కుంకుడుకాయల తో తల స్నానం చేయండి.తల స్నానం చేసిన ప్రతీ సారీ మీ దిండు కవరు ను మార్చటం, అలాగే మీ దువ్వెనను శుభ్రం చేసుకోవటం మరచిపోవద్దు...!!( ఒక వేళ ఇలా చేయకపోతే మళ్ళి వాటిల్లోని మట్టి, చుండ్రు అంతా తిరిగి మీ జుట్టు లోకి వచ్చి సమస్యను అధికం చేస్తుంది. )ఇలా వారానికి 2 సార్లు తప్పని సరిగా చేయటం ద్వారా ఎప్పటికి తెల్ల వెంట్రుకలు రావు..చుండ్రు పూర్తిగా పోతుంది. జుట్టు రాలటం తగ్గుతుంది.మరి "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను ఆచరించి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను

No comments:

Post a Comment