Saturday, November 15, 2008

దీపకుని కథ

ఇప్పటి వరకు మనము గురువు పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని తెలుసుకున్నాము కదా!!ఇప్పుడు మీకు ఒక సందేహం ..ఇవన్ని వినటానికి ,చదవటానికి మాత్రమేనా??మాకు గురువు పట్ల అంత భక్తి కలగాలంటే ఏమన్నా నిదర్శనాలు ఉన్నాయా?అని మీరు అడగవచ్చు.నిరభ్యంతరంగా మీకు కలిగే ఈ ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు మన పురాణాలలో ఉన్నాయి.అవి నేను కొన్ని చెప్పబోతున్నాను.అంతేకాక ఈ కలికాలంలో కూడా గురువును నమ్మి నేను పొందిన ,నాకు కలిగిన అనుభవాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.మరి సిధ్ధంగా ఉన్నారా??!! ఆధ్యాత్మికంసద్గురువు ను గురించి చెప్పటము ఎవరితరము కాదు. ఐనా ఆయన దయతో కలిగించిన ఈ అవకాశము ద్వారా నాకు లభించిన చిరు ఙ్నానం తో కొన్ని దివ్య కథలు తెలుసుకుందాం.పూర్వకాలంలో వేద ధర్ముడు అని ఒక గురువు గారి దగ్గర ఎంతో మంది శిష్యులు ఎంతో మంది శిష్యులు ఉండేవారు. వారిలో దీపకుడు ఎంతో శ్రద్ద తో గురువు గారి పట్ల వినయము తో ఉండేవాడు..ఒక రోజు గురువు గారు శిష్యుల భక్తి శ్రద్దలకు ఒక పరీక్ష పెట్టాలని ఈ విధంగా చెప్పారు.నాయనలారా!!పూర్వ జన్మ పాపం వల్ల నాకు ఇప్పుడు కుష్టు వ్యాధి కలగబోతున్నది.అందుచేత నేను సర్వపాపహరమైన కాశి లో ఉండి ఆ వ్యాదిని అనుభవించి నా పాపఫలాన్ని ఈ జన్మలోనే తొలగించుకుంటాను.మీలో ఎవరైనా నాకు ఆ సమయంలో సేవ చేయగలరాఅని ప్రశ్నించారు.శిష్యులంతా గురుసేవ లో యేమి లోపం కలుగుతుందో అని భయపడి వెనక్కు తగ్గారు.దీపకుడు మాత్రము గురువర్యా నేను తమరి సేవ చేసుకుంటాను.మీరు అనుమతి ఇస్తే ఆ పాపము నేను అనుభవిస్తాను అన్నాడు.గురువు గారు సంతోషించి నాయనా ఎవరి పాపము వారే అనుభవించాలి కాని, ఆ సమయము లో నేనెలా ఉంటానో నాకే తెలియదు అని చెప్పటము తో దీపకుడు గురువుగారికి నమస్కరించి గురు సేవకు పూనుకున్నాడు.తరువాత యేమి జరిగిందో తదుపరి పొస్ట్ లో తెలుసుకుందాము..




No comments:

Post a Comment