Sunday, December 21, 2008

(5 వ భాగం) మాతృదేవో భవ – గరుత్మంతుని మాతృభక్తి,శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం

(5 వ భాగం) మాతృదేవో భవ – గరుత్మంతుని మాతృభక్తి,శ్రీ మహావిష్ణు సాక్షాత్కారం

తన తల్లి ఐన వినత సమక్షం లో, పిన తల్లి ఐన కదృవను పిలిచి గరుత్మంతుడు ఈ విధంగా పలికాడు."పినతల్లీ!!నీవు కోరిన విధంగా అమృతం తెచ్చి ఇచ్చాను.నన్నూ, నా తల్లినీ, దాస్య విముక్తులను చేయమని" కోరాడు.అమృతమును చూసిన అనందం లో కదృవ, ఆ రోజు నుంచి వారిని దాస్య విముక్తులను చేసింది.ఆ తర్వాత కదృవ కుమారులంతా అమృతపానం చేయటానికి ముందుగా నదిలోకి స్నానం చేయటానికి వెళ్తారు.కదృవ, వినతకు చేసిన మోసం ఇంద్రునికి తెలుసు కాబట్టి వారికి అమృతభాండం దక్కకూడదని తిరిగి స్వర్గలోకానికి తీసుకు వెళ్ళిపోయాడు.ఆత్రంగా వచ్చిన కదృవ కొడుకులు దర్భల మీద అమృతభాండం లేకపోవటం చూసి ఆక్రోశించి, బాధపడి కొంచెం ఐనా దర్భల మీద అమృతం ఒలికిందేమోనని నాకారు.పదునుగా ఉన్న దర్భలవల్ల నాగుల నాలుక రెండుగా చీలింది.ఆనాటి నుంచి నాగజాతికి రెండు నాలుకలు యేర్పడ్డాయి.తల్లికి దాస్య విముక్తి చేసిన గరుత్మంతుడు స్వామి అనుగ్రహిస్తే సాక్షాత్త్ శ్రీ మహావిష్ణువుకు వాహనంగా ఉంటానని కోరాడు.గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చుకుని,స్వామి,గరుక్మంతుణ్ణి వాహనంగా స్వీకరించారు.

తల్లిని గౌరవించి, ఆమెకు దాస్యవిముక్తిని చేసిన గరుత్మంతుడు స్థితికారుడైన శ్రీమన్నారాయణునికే వాహనమయ్యాడు.కనుక ప్రతివారూ ముందుగా తల్లిని పూజించి, గౌరవిస్తే ఉన్నత పదవులు వారి వద్దకే వెతుక్కుంటూ వస్తాయనటం లో సందేహం లేదు.

1 comment:

  1. గరుత్మంతుడు అని కదా రాయాలి అచ్చుతప్పు సరిచేస్తారా

    ReplyDelete