Sunday, December 21, 2008

(1 వ భాగం) మాతృదేవో భవ - వినత,కదృవ పందెం..

మాతృదేవో భవ - వినత,కదృవ పందెం..


పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కదృవ ఒకరోజున ముచ్చటించుకుంటున్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటటే, కదృవ నాగజాతికి జన్మనిచ్చింది. వినతకు ఇంకా సంతాన భాగ్యం కలుగలేదు. వారిద్దరూ ఒకరోజున తెల్లని, అందమైన గుఱ్ఱాన్ని చూసారు..వినత ఆ గుఱ్ఱాన్ని చూసి ముచ్చటపడి, "కదృవా!!ఆ గుఱ్ఱం చూడు.. ఎంతో అందంగా, ఒక్క మచ్చైనా లేకుండా చాలా తెల్లగా ఎంత బావుందో..అని ఆ గుఱ్ఱాన్ని చూసి మురిసిపోయింది. అది విన్న కదృవ "లేదు, లేదు ఆ గుఱ్ఱానికి ఒక నల్లని మచ్చ ఉన్నది అన్నది".ఈ విషయంలో ఇద్దరికీ వాదన, పంతం పెరిగాయి.ఇద్దరూ ఒక పందెం వేసుకున్నారు. గుఱ్ఱానికి మచ్చ ఉంటే వినత జీవితాంతం కదృవకు దాసీ గా ఉండాలి. మచ్చ లేకుంటే కదృవ, వినతకు జీవితాంతం దాసీ గా ఉండాలి..అని పందెం వేసుకున్నారు.పందెం ఐతే ఒప్పుకున్నది కానీ, కదృవకు కొంచెం భయం వేసి పైకి బింకం గా ఇప్పుడు చీకటి పడింది కదా!! రేపు చూద్దాం అని అప్పటికి తప్పించుకుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఈ పందెం లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో....




No comments:

Post a Comment