Friday, February 27, 2009

పితృదేవోభవ

ఇప్పటి వరకూ మాతృదేవోభవ - మాతృమూర్తి గురించి కొంత తెలుసుకున్నాము.తరువాతి స్థానం పితృదేవోభవ - తండ్రిది. తండ్రి, తల్లి బిడ్డకు జన్మనిస్తే, తండ్రి పోషణ చేసి, విద్యాబుద్ధుల్ని నేర్పి,ఉన్నత వ్యక్తిగా బిడ్డను తీర్చిదిద్దుతాడు.అందుకనే తండ్రిని మన సమాజం తల్లి తరువాత స్థానంలో గౌరవించింది.తండ్రిమాట పాలించి, లోకానికి ఆరాధ్యుడైన శ్రీ శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడైనాడు.తండ్రి కైకకు ఇచ్చిన వరాలు నెరవేర్చటానికి,పదునారేండ్ల ప్రాయంలో వనవాసం చేసాడు.అంతేకానీ నీవు మాట ఇస్తే నేనెందుకు వనవాసం చేయాలి అనలేదు.తండ్రిమాట వేదవాక్కుగా భావించాడు.తరువాత భరతుడు వచ్చి నీ రాజ్యం నీవే పాలించాలి.నాకు అర్హత లేదు అని బ్రతిమిలాడినా,వారి వంశచరిత్రను సత్య వాక్య పాలనను గురించి వివరంగా బోధించి తనమాట మీదనే నిలబడి పితృవాక్యపాలనను గురించి వివరంగా బోధించి, తనమాట మీదనే నిలబడి పితృవాక్య పాలన చేసి దేవుడై మనందరి చేతా పూజించబడుతున్నాడు.కనుక ప్రతి బిడ్డ కూడా తల్లిని,తండ్రినీ గౌరవించి, వారిని ఆదరించి ప్రేమగా చూస్తే వారిని దేవుడు కూడా కరుణిస్తాడు.తల్లిని, తండ్రినీ సేవించి ముమ్మారు ప్రదక్షిణ చేసిన గణపతి తొలివేల్పుగా పూజలందుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే..!!ఇటువంటిదే మరొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం తదుపరి పోస్ట్ లో...

No comments:

Post a Comment